- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మద్దూరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు
by Sumithra |

X
దిశ, మద్దూరు (దూల్మిట్ట) : మద్దూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. మండల కేంద్రానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ట్రాక్టర్ యాజమాని సలాకాపూర్ మద్దూరు మధ్యలో వున్న వాగునుండి ఇసుక రవాణా జోరుగా సాగిస్తున్నారు. ట్రాక్టర్ లోడ్ ఇసుకకు రూ.5000 నుండి రూ.7000 వరకు వసూలుచేస్తూ మద్దూరు, ధర్మారం, సలాకపురం, గ్రామాలకు తరలిస్తున్నట్టు సమాచారం. అక్రమ ఇసుక రవాణను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకొని ఇసుకరవాణాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Next Story