Sangareddy : హార్ట్ స్టెంట్ తయారీ పరిశ్రమ..వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

by Aamani |
Sangareddy : హార్ట్ స్టెంట్ తయారీ పరిశ్రమ..వర్చువల్‌గా  ప్రారంభించిన ప్రధాని మోదీ
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కులో హార్ట్ స్టెంట్లు తయారి పరిశ్రమను ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముంగళవారం ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా (Delhi) ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ హార్ట్ స్టెంట్ తయారి పరిశ్రమను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబులు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ దేశీయంగా స్టంట్ లు తయారు చేయడం వల్ల గుండె ఆపరేషన్ల ఖర్చు తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో గుండె ఆపరేషన్లకు సంబంధించి స్టంట్లను తయారుచేసి సహజ ఆనంద్ మెడికల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కావడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.

ధన్వంతరి జయంతి 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. సహజానంద్ టెక్నాలజీ ప్రైవేట్ సంస్థ గుండె ఆపరేషన్లలో కీలకమైన స్టంట్లను తయారు చేయునట్లు మంత్రులు తెలిపారు. దేశీయంగా స్టంట్ లు తయారు చేయడం వల్ల గుండె ఆపరేషన్ల ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. ఇలాంటి పరిశ్రమ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ డివైస్ పార్కులో ఏర్పాటు కావడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీజీ ఐ ఐ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో కార్యాలయ అధికారి అజిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఆర్ డీఓ రవీందర్ రెడ్డి, సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ఎం డీ ఎస్ హెచ్ ధీరజ్ లాల్ కోటాడియా, పరిశ్రమల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed