- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథేచ్ఛగా రోడ్డుపై చెప్పుల కుప్పలు..
దిశ,కంగ్టి : మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌక్ నుంచి నారాయణఖేడ్ వెళ్లే ప్రధాన రహదారిపై యథేచ్చగా పాత చెప్పులు , షూస్ లను కుప్పలుగా వదిలారు. రోడ్డుపై వదిలే దుకాణదారుల ప్రవర్తనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత చెప్పులను తమ దుకాణాల ఎదుట రోడ్లపై పడవేయడం వల్ల స్థానికంగా పారిశుద్ధ్య పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ప్రధాన మార్గం గ్రామ నడిబొడ్డున రహదారిపై చెప్పుల కుప్పలు పేరుకుపోవడంతో రాకపోకలు సైతం ఇబ్బంది గా మారాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాత చెప్పులు నీటిలో కలిసి ప్రమాదకర పరిస్థితులను సృష్టించే ప్రమాదం ఉంది. ప్రజలు దీనిపై సంబంధిత పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. రోడ్డు క్రాసింగ్ కుప్పగా ఉండడంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు పడుతున్నారు , వెంటనే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు సత్వరమే స్పందించి, వీటి తొలగింపు, శుభ్రత చర్యలను చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.