- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారా : మంత్రి హరీశ్‌రావు
దిశ, సదాశివపేట : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.60వేలు ఇస్తే ఆ డబ్బు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సదాశివపేట పురపాలక సంఘం సిద్దాపూర్ లో లబ్ధిదారులతో డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
నాగిరెడ్డిపల్లి గ్రామ దశ దిశ మారిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘ అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఆయన తనయుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్, పురపాలక సంఘం వైస్ చైర్మన్ చింతా గోపాల్, రెవెన్యూ, పోలీసు, ఆర్ అండ్ బీ , మున్సిపాలిటీ, వివిధ శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు.