Forest Department : అటవీశాఖ అధికారులకు నక్షత్ర తాబేలు అప్పగింత

by Aamani |
Forest Department : అటవీశాఖ అధికారులకు నక్షత్ర తాబేలు అప్పగింత
X

దిశ, సంగారెడ్డి : అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేలును అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. సంగారెడ్డి పట్టణనికి చెందిన రాజు మార్కుంది అనే యువకునికి నక్షత్ర తాబేలు దొరికడంతో ఆ విషయం ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్రకు తెలుపగా ఆయన సంగారెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం సంగారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.వీరేంద్ర బాబు సమక్షంలో అట్టి నక్షత్రా తాబేలు అటవీ శాఖ సిబ్బందికి అప్పగించారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేలును ఆధికారులు రక్షించి జంతు జాతులను, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిది పురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండు రంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed