తుపాకీ.. మిస్ ఫైర్: ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు

by Shiva |
తుపాకీ.. మిస్ ఫైర్: ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: తుపాకీ శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ అయి ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలైన సంఘటన సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో చోటుచేసుకుంది. సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో 2013 బ్యాచ్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ తుపాకీ శుభ్రం చేస్తున్న క్రమంలో మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో రాజశేఖర్ కుడి కన్ను పై భాగంలో గాయమైంది. ఈ మేరకు సహచరులు హుటాహుటిన అతడిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందజేసి.. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

Advertisement
Next Story