- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూగర్భ జలాలను పెంపొందించుకోవాలి
దిశ, సంగారెడ్డి : భూగర్భ జలాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా భూగర్భ జల శాఖ హైడ్రాలజిస్ట్ వాజిద్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణం ఆవరణలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జిల్లా కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజిద్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు కట్టుకోవాలని, నీటి సంరక్షణ కచ్చితంగా పాటించాలని సూచించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులు నీటి పొదుపు పైన అవగాహన పెంపొందించుకోవాలని, నీటి నాణ్యత, అవసరం, నీటి యొక్క విలువ, నీటి శాతాలు మన భూమి మీద ఏ మేరకు ఉన్నాయో తదితర వివరాలు వెల్లడించారు. గౌరవ అతిథి ఆబెన్ బేవ్ కంపెనీ ప్రతినిధి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ఉన్న నీటి వనరుల పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవాలన్నారు. జలవనరులను ప్రతి ఒక్కరం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం తమ తరఫున తమ వంతు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ జిల్లా మేనేజర్ సుగుణ, విజన్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ బాల, జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, వివిధ పాఠశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, విజన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.