- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ భూమి కబ్జా.. సర్వే చేసిన అధికారులు
దిశ, సంగారెడ్డి: సర్వే నెం.229 కులబ్ గూర్ లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయం సర్వే, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ముస్తఫా గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని చెరువుకు ఆనుకుని ఎస్.ఎస్.ఎమ్ గోల్డెన్ టౌన్ షిప్ యజమానులు ఆక్రమించి వెంచర్ చేశారని మంత్రి హరీష్ రావుకు తెలిపారు.
సదరు వెంచర్ పై వెంటనే సర్వే చేసి భూమి ఆక్రమణకు గురైందా లేదా సర్వే చేయాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించడంతో అధికారులు మంగళవారం కులబ్ గూర్ లోని వెంచర్ తో పాటు ప్రభుత్వ భూమిని సర్వే చేశారు. వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమికి సంబంధించిన 24 గుంటల భూమిని కబ్జా చేసినట్లు నిర్ధారించారు. వెంచర్లో చేస్తున్న పనులను వెంటనే ఆపివేయాలని నోటీసులు అందించారు. బఫర్ జోన్ నుంచి రాడ్‌లు, పార్క్, ట్రాన్స్‌ఫార్మర్లను తీసివేయాలని, హైవే ప్రాంగణంలో ఉన్న యూజీడీని తొలగించాలన్నారు.
అధికారులు వేంచర్ యజమానులకు సర్వే నివేదికను అందించారు. 24 గుంటల ప్రభుత్వ భూమికి చెందిన హైవే భూమిని ఆక్రమించారని నిర్ధారించామని ఈనెల 21న మార్కింగ్ చేస్తామని తెలిపారు. ఈ సర్వేలో సంగారెడ్డి తహసీల్దార్ విజయ్ కుమార్, సంగారెడ్డి ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఏడీ సీహెచ్.బాలరాజ్, సర్వేయర్ కోటేశ్వర్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ ముస్తఫా, మహ్మద్ అమీరుద్దీన్, ఉప సర్పంచ్ హషమ్ అలీ, కులబ్ గూర్ పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.