- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు గట్టిషాక్…
దిశ, అందోల్: అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కోక్కరు పార్టీని వీడుతుండడంపై ఆ పార్టీ పరిస్థితి దారుణమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడంతో నాయకులను కట్టడి చేయలేకపోతున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే మున్సిపాలిటీకి చెందిన ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీకి టచ్‌లో ఉండడం, ఒకరైతే బహిరంగంగానే మంత్రి దామోదర్ వెంటే ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరే కాకుండా ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోఉన్నట్లు సమాచారం. గత రెండు రోజుల క్రీతం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్‌ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీ పార్టీలో చేరిన సంగతి విధితమే. ఇదిలావుండగా ఆదివారం అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ గాజుల నవీన్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్యకు అత్యంత సన్నిహితుడు, ముఖ్య అనుచరుడు కడాల రాములుతో పాటు మరికొంత మంది ఎంపీ బీబీ పాటీల్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి ఆయన ఘన స్వాగతం పలుకుతూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పాటుపడాలని వారికి సూచించారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ మరోకరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పార్టీని వీడకుండా కట్టడి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సాధించడం కష్టమేనని ఆ పార్టీకి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు.