- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గజ్వేల్ గడ్డ తెలంగాణ రాష్ట్రానికి అధిష్టానం : వంటేరు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: గజ్వేల్ అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామని ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు మద్దతుగా గజ్వేల్ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...గజ్వేల్ గడ్డ తెలంగాణ రాష్ట్రానికి అధిష్టానం అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌కు 2014, 2018లో గజ్వేల్ ప్రజలు ఓటు వేస్తే రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. మూడోసారి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని ప్రేమ ఆశీర్వాదం అందించాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదరికం రుపుమాపాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు గజ్వేల్ ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. గజ్వేల్ నియోజక వర్గం విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 5 సంవత్సరాల్లో ఏన్నడు కనపడని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు.
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ...గజ్వేల్ సాగు, తాగు నీటి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే గజ్వేల్ అభివృద్ధి జరిగిందన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ గజ్వేల్ ను వదిలి వెళ్లుతారనే తప్పుడు ప్రచారాలకు తెరలేపారన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ఉంటారన్నారు. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, మాదాసు శ్రీనివాస్, చంద్రమౌళి, అమరవతి శ్యామ్, పంగ మల్లేషం, వెంకటేశం గౌడ్, మధు, చంద్రమోహన్, జాఫర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.