- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతి లేకుండా టేకు చెట్లు నరికి వేసిన మాజీ సర్పంచ్
దిశ, మద్దూరు: ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెంచిన పలు టేకు చెట్లను, విద్యాశాఖ అధికారుల, అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా, స్థానిక మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ అక్రమంగా చెట్లను నరికి వేయడంతో, ఫారెస్ట్ బీట్ అధికారి రాముడు శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారుల అనుమతులు లేకుండా మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ మూడు టేకు చెట్లను నరికి వేయడం వల్ల అతనిపై కేసు నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనాంజనేయులు మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్ల తొలగింపు పై ఎలాంటి సమాచారం లేదని, మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ కు టేకు చెట్ల తొలగింపు గురించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, చెట్ల తొలగింపుకు ఎలాంటి తీర్మానం చేయలేదని, పాఠశాల సెలవులు ఉన్నప్పుడు తనకు తెలియకుండా చెట్లను నరికి వేసినట్లు తెలిపారు.