కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ
X

దిశ, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని ఏడాది లోపే వదులుకున్న మాజీ ఎమ్మెల్సీ, టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుడు ఆర్. సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేటలో జరిగిన ఎన్నికల సభ సందర్భంగా హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణతో పాటు బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఎ.నర్సింహారెడ్డి, జిట్టే రవి, అమీనొద్దీన్, జి.పండరి, అనంతసాగర్, ప్రభాకర్, లక్ష్మణ్, నూతన్ కుమార్, రాజమౌళి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, పి. నర్సారెడ్డి, పార్టీ నాయకులు పులిమామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ..

సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ, కౌన్సిలర్ విశ్వనాథం గురువారం సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడీల రాంరెడ్డి, పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి జగ్గారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చాట్ల సిద్ధన్న పాటిల్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు ,మండల నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరికిషన్ కూడా జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఖాళీ కానున్న బీఆర్ఎస్..

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ పాలకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం విదితమే. ఇటీవల కాలంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న మున్సిఫల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ నెగ్గింది. దీంతో మున్సిపల్ చైర్ పర్సన్ తో

సహా వారికి సపోర్ట్ చేసిన కొందరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో టచ్ లో ఉంటున్నారు. నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బతగలనుంది. అదే విధంగా పార్టీలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం.

Next Story

Most Viewed