అల్లు అర్జున్ పోస్ట్ ఎఫెక్ట్.. ట్విట్టర్ నుంచి నాగబాబు అవుట్.. కారణం వారేనా?

by Hamsa |   ( Updated:2024-05-17 10:58:20.0  )
అల్లు అర్జున్ పోస్ట్ ఎఫెక్ట్.. ట్విట్టర్ నుంచి నాగబాబు అవుట్.. కారణం వారేనా?
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని నెట్టింట ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరపున కాకుండా స్నేహితు శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ గొడవల వల్లేనని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ ప్రచారంపై వివాదం కూడా అయి అల్లు అర్జున్‌పై కేసు కూడా నమోదు చేశారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఓ ట్వీట్ కూడా చేశారు. ‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని బన్నీని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. ఇక దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లు ఓ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అల్లు రామలింగయ్య లేకుంటే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ’’ రాసి ఉండటంతో అది కాస్త ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కానీ కొందరు మాత్రం ఆ పోస్ట్ అతను పెట్టలేదని వాదిస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, బన్నీ పోస్ట్ కారణంగా నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌నే డియాక్టివేట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై చిరంజీవి, అల్లు అరవింద్ నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మనమంతా ఒకటే కుటుంబం నువ్వు అలాంటి పోస్ట్ పెట్టడం ఏంటని నాగబాబును మందలించారట. దీంతో ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేయడం గమనార్హం. అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పినట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఇంతటితో ఈ గొడవ ముగుస్తుందా? లేక మరింత పెరుగుతుందా? అన్న అనుమానాలు మెగా ఫ్యాన్స్‌ను కలవర పెడుతున్నాయి.

Read More...

రైతులకు శుభవార్త..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Advertisement

Next Story