సిగ్గు సిగ్గు! విశ్వగురు చీప్ జోక్! ప్రధానిపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

by Ramesh N |   ( Updated:2024-05-19 12:56:03.0  )
సిగ్గు సిగ్గు! విశ్వగురు చీప్ జోక్! ప్రధానిపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ప్రచారంలో దూసుకపోతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ పలు ఛానల్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ నేషనల్ మీడియాకు ప్రధాని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే సిగ్గు సిగ్గు అంటూ.. బీఆర్ఎస్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేసింది. "దేశంలో ధనవంతులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది, ధనికులు మరింత సంపన్నులు అవుతున్నారు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు అని ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?" అని జర్నలిస్ట్ ప్రధానిని ప్రశ్నిస్తారు.

దీనికి ప్రధాని మోడీ "ఏంటి ఇప్పుడు అందరూ పేదవాళ్ళు అవ్వాలా? అప్పుడు ఏం తేడా ఉండదు." అని సమాధానం చెబుతారని బీఆర్ఎస్ పేర్కొంది. దేనికైనా సమాధానం తెలియనప్పుడు ఒక చీప్ జోక్ వేసి తప్పించుకోవడం విశ్వగురు లేకితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసింది.

Advertisement

Next Story