- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి..
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ టాగూర్, టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోదండ రెడ్డి, సురేష్ షట్క ర్ ల ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక మారు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ తరవాత కాంగ్రెస్ పార్టీలోని కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ శాంతికి టిక్కెట్ ఇవ్వడంతో పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు.
కాని ఎన్నికల్లో విజయ శాంతి ఓడిపోవడంలో శశిధర్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయన బీజేపీలో చేరారు. కొంత కాలం అందులో ఉన్న శశిధర్ రెడ్డి బీజేపీకి సైతం రాజీనామా చేశారు. గతంలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ నేతల హామీతో కొంత కాలం ఏ పార్టీలో చేరాకుండా స్తబ్దంగా ఉన్నారు. శుక్రవారం రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.