- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎనుములను నమ్మితే.. ఎగవేతలే : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎనుములను నమ్మితే అన్ని ఎగవేతలే అని ప్రజలకు తెలిసిపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మహిళా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిందన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చామని గొప్పలు చెప్పకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం అని మోసం చేశారని గుర్తు చేశారు. చిన్న ఉద్యోగం అని చులకన భావంతో చూడవద్దు, ఇంటిని వీడి అడుగు బయట పెట్టి జీవితంలో ముందుకు సాగాలన్నారు. టాటా, బిర్లా వంటి పెద్ద పెద్ద బిలియనీర్లు చిన్న చిన్న జాబ్ ల తోనే జీవితం ప్రారంభించారన్నారు. సిద్దిపేట కేసీఆర్ నగర్ కు చెందిన సల్మా నేహా అనే మహిళ నాలుగు ఉద్యోగాలు సాధించింది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.