- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుతో బలిజ సమాజానికి ఎంతో మేలు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుతో వీరశైవ లింగాయత్ బలిజ సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని వీరశైవ లింగ బలిజ సమాజం జిల్లా గౌరవ అధ్యక్షుడు శివప్ప, వీరశైవ లింగ బలిజ సమాజం అధ్యక్షుడు యాదగిరి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ళుగా లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్ ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం చొరవ చూపిన సురేష్ షెట్కర్, సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడి ఉన్న లింగాయత్ కుటుంబాలకు కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా గుడిమెట్ల నుంచి కొలనుపాక వరకు జరిగే రేణుక చారి జయంతి పాదయాత్ర ఈనెల 19న సిద్దిపేటకు చేరుకుంటుందన్నారు. ఈ మేరకు సిద్దిపేట కోటిలింగేశ్వర ఆలయంలో మహా స్వామి ప్రవచనాలు కార్యక్రమం ఉంటుందన్నారు. వీరశైవ లింగాయత్ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగ బలిజ సమాజం నాయకులు శివకుమార్,రాజమౌళి, నాగరాజు, అరుణ్, శ్రీనివాస్, అనిల్, రంజిత్, బద్రి పలువురు పాల్గొన్నారు.