- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రంగధాంపల్లి రాజీవ్ రహదారి పై ఫ్లై ఓవర్ నిర్మించాలి'
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రంగధాంపల్లి రాజీవ్ రహదారి పై ఫ్లై ఓవర్ నిర్మించాలని రంగధాంపల్లి ప్రజలు కోరారు. ఆదివారం రంగధాంపల్లి వద్ద రోడ్డు నిర్మాణ పనులను వార్డు ప్రజలు అడ్డుకుని ఎన్ హెచ్ 765 డీజీ డీఈఈ కి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ రహదారి 765 లో భాగంగా తమ గ్రామ పరిధిలో బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి హుస్నాబాద్ రోడ్డులో బ్రిడ్జి వరకు అండర్ పాస్ పనులు ప్రారంభించారని, దీంతో తమ ఇండ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్నామన్నారు.
గ్రామస్తులందరం వ్యవసాయం పై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నామన్నారు. తమ పొట్ట కొట్టకుండా రాజీవ్ రహదారి మీదుగా ప్లై ఓవర్ నిర్మించి గ్రామస్తులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లై ఓవర్ నిర్మించే వరకు నిర్మాణాలు కూల్చవద్దని, పనులను నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ నాగిరెడ్డి, వంగ తిరుమల్ రెడ్డి, ముత్యాల కనకయ్య, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ స్వామి, రజనికాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వంగ దుర్గారెడ్డి, రాజు, ఈర్లరంగం, ఆంజనేయులు, కనకరెడ్డి, సంజీవరెడ్డి, మధుసుధన్ రెడ్డి, జికూరి తిరుమల్, సింగారం శ్రీనివాస్, వంగ వెంకట్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.