తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.. సిద్దిపేటలో వెలసిన ఫ్లెక్సీ

by Aamani |
తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.. సిద్దిపేటలో వెలసిన ఫ్లెక్సీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపు పై విమర్శలు, అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్న వేళ సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలసిన ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అంబేద్కర్ సర్కిల్ సమీపంలోని బంగ్లాపై తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా....!!, తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్...!! ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై వివిధ పార్టీల నాయకులు నిరసన తెలిపిన వేళ.. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పై చూపిన వివక్షను ఎత్తి చూపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లోని అంశాలు ఆసక్తికర చర్చకు దారితీసింది.

Advertisement

Next Story

Most Viewed