- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
దిశ, బెజ్జంకి : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండల పరిధిలోని తోటపల్లి తో పాటు బెజ్జంకి మార్కెట్ కమిటీ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పెర్కబండ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి (పీఎం ఎఫ్ఎంఈ) ద్వారా చిలుముల లక్ష్మి కి మంజూరైన నిధులతో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్ ను ప్రారంభించి, ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా మంజూరైన ఆరు లక్షల రూపాయలతో స్కూల్ లో బోర్, మూత్రశాలలు, కిచెన్ మరమ్మత్తులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు, మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని, త్వరలో రైతు భరోసా ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు. రైతులకు సన్న వరి ధాన్యానికి 500 ఇస్తూ వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని, గ్రామీణ మహిళలు ఎంటర్ప్రైజ్ స్ ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తూ వారు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి అనేక కొత్త పథకాలను తీసుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ,ప్యాంక్స్ చైర్మన్ శరత్ రావు, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఒగ్గు దామోదర్, జెల్ల ప్రభాకర్, వడ్లూరి పరుశురాములు, ఎండిసాదిక్, డైరెక్టర్లు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.