- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలకరి చినుకు కోసం అన్నదాత ఎదురుచూపు..
దిశ, మిరుదొడ్డి : మృగశిర కార్తి సగం పాదం పూర్తయినా, నేటికీ వరణుడు కనుకరించకపోవడం పుడమి తల్లి బీటలు వారి, దున్నడానికి అనువుగా లేకపోవడంతో అన్నదాతను ఆందోళనకు గురిచేస్తుంది. ఇదివరకు రోహిణి కార్తెలోనే విత్తనాలు విత్తుకునే వారమని ఈసారి మృగశిర కార్తె సగం పాదం పూర్తయినా వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి, కంది విత్తనాలను విత్తుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్తిలో విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందని వారి నమ్మకం. కానీ ఇప్పటికీ వర్షాలు లేక భూమి చదును చేసుకోలేని పరిస్థితిలో అన్నదాత వున్నాడు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బానుడు భగభగ మండుతూ ఎండ కాలాన్ని తలపిస్తున్నాడు.
గత యాసంగి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో పొలాల్లో రాలిన వడ్లతో, కల్లాలో తడిసిన ధాన్యంతో రైతన్నకు కన్నీరు మిగిల్చి కనీసం పెట్టుబడికైనా డబ్బులు మిగలలేదు. నేలనే నమ్ముకున్న రైతన్న యాసంగి నష్టపరిచినా వానాకాలంలోనైనా అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తాడు. కానీ పునాస పంటలను పండించుకునే రైతన్నలకు వరణుడు కరుణించకుండా కాలం కాటు వేసినట్టు కరువును మిగిల్చేటట్లు చేస్తూ ముఖం చాటేయడంతో అన్నదాతకు ప్రశ్నర్ధకంగా మారింది. మబ్బుల్లో ఉన్న మేఘం కరగాలి చినుకై నేలన కురవాలి పుడమి తల్లితడిసి ముద్ద అవ్వాలి, అన్నదాత ఆనందంతో దుక్కి దున్ని విత్తనాలు నాటాలని ప్రతిరోజు ఆకాశం వైపు కరుణించమని ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు. మరి వరుణుడు కరుణిస్తాడో లేక కర్షకునికి మళ్లీ కన్నీళ్లను మిగిల్చి వానాకాలంలో కూడా కరువును మిగిల్చి కాటు వేస్తాడో కాలమే నిర్ణయించాలి.