Raithu Sabha: వెలవెలబోయిన రైతు కృతజ్ఞత సభ..

by Aamani |
Raithu Sabha: వెలవెలబోయిన రైతు కృతజ్ఞత సభ..
X

దిశ,యాచారం : రైతును రాజును చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున రైతు కృతజ్ఞత సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రం డిఎస్.ఆర్ గార్డెన్ లో కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి కోదండ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభకు రైతులు పెద్దగా హాజరు కాకపోవడంతో సభ వెలవెల పోయింది. లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరగడంతో నిర్వహించిన రైతు కృతజ్ఞత సభ ప్లాప్ అయ్యింది ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరు కాకపోవడంతో కార్యకర్తలు నాయకులు ఎవరు పెద్దగా రాలేదు. కొంతమంది పార్టీ నాయకులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

వచ్చిన కొద్ది మంది తోటే సభను మమ అనిపించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ.. రైతులందరికీ లక్ష వరకు రుణమాఫీ జరిగిందని త్వరలోనే రెండు లక్షల వరకు ఉన్న రుణాలు కూడా మాఫీ అవుతాయని వివరించారు రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతు సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ప్రగతి పదంలో పయనిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్త పరిచారు. త్వరలోనే ధరణి భూమి సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని భూ న్యాయ నిపుణులు సునీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు లిక్కి పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్ మామ, ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్ రెడ్డి, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed