- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘనంగా లంకాదాహనం
దిశ, అందోల్: జోగినాథ రథోత్సవాల్లో భాగంగా నిర్వహించిన లంకాదాహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హైస్కూల్ మైదానంలో లంకాదాహనం కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన లంకాదాహన కార్యక్రమం అర్థరాత్రి వరకు కొనసాగింది. సుమారుగా 40 అడుగుల ఎత్తుతో 10 తలల రావణాసురుడి ప్రతిమను తయారు చేశారు.
సుమారుగా రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. రావణాసురుడి ప్రతిమతో పాటు సర్పాలు, పూల చెట్లను బాణా సంచాలతో తయారు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జోగినాథ అలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రావణుడి ప్రతిమను పెల్చేందుకు విద్యుత్ సరఫరాతో కూడిన స్వీచ్‌లతో ప్రతిమను పెల్చారు. ఒక్కో తలకు ఒక్కో స్వీచ్‌ను ఏర్పాటు చేసి, ఒక్కోక్కటిగా పెల్చారు. రాత్రి 8గంటల నుంచే బాణాసంచా చప్పుళ్లతో పట్టణ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి జోగిపేట చుట్టుపక్క ప్రాంతాలకు చెందిన ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.
లంకాదహనం కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్కేస్ట్రా నిర్వాహకులు పాటలు పాడి ప్రజలను అలరించారు. ఈ కార్యక్రమంలో యూ ట్యూబర్ పుంజు (రాజు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీజేపీ రాష్ట్ర యువ నాయకులు ఉదయ్ బాబుమోహన్, రథోత్సవ కమిటీ ఆర్గనైజర్ పి.శివశేఖర్, కమిటీ అధ్యక్షులు డాకురి శివ శంకర్, కోశాధికారి రంగ సురేష్, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్.సురేందర్ గౌడ్, నాగరాజు (నాని), దుర్గేష్, చందర్, జోగినాథ అలయ కమిటీ, రథోత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.