- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ అక్రమాల చిట్టా ప్రజలకు వివరిస్తా..!
దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి ఆలయ చైర్మన్ చేసిన అవినీతిపై గతంలోనే గంగ రేగు చెట్టు కిందికి బహిరంగ చర్చకు రమ్మంటే రాలేదని, అతనికి సీపీఎం పార్టీని విమర్శించే నైతిక విలువలు లేవని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సనాది భాస్కర్ హెచ్చరించారు. కొమురవెల్లి పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుట్టపైన ఎల్లమ్మ ఆలయం వద్ద పాకశాల నిర్మిస్తానని ఓ భక్తుడి దగ్గర రూ.5లక్షలు తీసుకున్నావని ఆరోపించారు. ఆలయ నిధుల నుండి ధర్మకర్తలకు బట్టలు పెట్టాలని డబ్బులు తీసుకున్నావని, ఏ ధర్మకర్తకు బట్టలు ఇప్పించావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఎన్ని డబ్బులు తీసుకున్నావో లెక్కలతో సహా ఉన్నాయన్నారు. మేము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని నీకు నీతి నిజాయితీ ఉంటే ఇప్పటికైనా గంగరేగు చెట్టు వద్దకు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాం సాగర్, సర్పంచ్ తాడూరి రవీందర్, కే పీఏఎస్ జిల్లా అధ్యక్షులు బాలకిషన్, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగా కిష్టారెడ్డి, నాయకులు తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, మేకల కృపాకర్, సార్ల యాదయ్య, నీల బిక్షపతి, కర్రోళ్ల ఎల్లయ్య, తాడూరి ఆనందం తదితరులు పాల్గొన్నారు.