- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవో శ్రీనివాస్ పై విచారణ
దిశ, శివ్వంపేట : మండలంలోని చిన్న గొట్టిముక్కల గ్రామపంచాయతీ పరిధిలో గల చాకరమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయ ఈవో గా విధులు నిర్వహిస్తున్న సార శ్రీనివాస్ పై దేవాదాయ శాఖ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. ఆంజనేయ స్వామివారి ఆభరణాలన్ని భద్రంగా ఉన్నాయా.. రికార్డులన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని గురువారం దేవాదాయ, ధర్మదాయశాఖ సహాయ కమిషనర్ శివరాజ్, ఇన్స్‌పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం స్వామివారి ఆభరణాలు ఏమున్నాయి..ఏయే బ్యాంకుల్లో భద్రపరిచారనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దాతలు సమర్పించిన విరాళాలు, రసీదులు, నిత్యన్నదానం కోసం అందిన విరాళాల గురించి రికార్డులను పరిశీలించారు. విచారణ నివేదికను దేవాదాయ, ధర్మదాయ శాఖ ఉన్నతధికారులకు నివేదిస్తామని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రుల దేవదత్తు శర్మ, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.