ప్రతి ఒక్కరు సమగ్ర సర్వేలో పాల్గొనాలి.. కలెక్టర్ ఎం.మనుచౌదరి

by Sumithra |
ప్రతి ఒక్కరు సమగ్ర సర్వేలో పాల్గొనాలి.. కలెక్టర్ ఎం.మనుచౌదరి
X

దిశ, ములుగు : ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి సర్వే ఎన్యూమరేటర్లను ఆదేశించారు. నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ ములుగు మండల కేంద్రం కొండపాక మండలం దుద్దెడ గ్రామాలలో ఆయన పర్యటించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించి మొదటి రోజు కాబట్టి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటార్లను అడిగి తెలుసుకుని ఇబ్బందులు ఉంటే సూపర్వైజర్లకు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటికి స్టిక్కరింగ్ వేయడం పూర్తి చేశామని, ప్రభుత్వం నిర్దేశించిన ఫారంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ప్రతి కుటుంబం నుంచి సేకరించి నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

శనివారం మొదటి రోజు కాబట్టి ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వివరాలను పొందుపరచాలని అన్నారు. దాదాపు 57 కు పైగా అంశాలలో వివరాలను నమోదు చేయవలసి ఉన్నందున ఎమ్యూనరేటర్ కు ఒక సహాయకులను నియమించుకుంటే బాగుంటదని సూచించారు. ప్రతి ఒక్క బ్లాకుకు ఒక ప్రత్యేక ఎన్యుమరేటర్ ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలని కోరారు. అన్ని స్థాయిల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వేలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సర్వేవలన ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి అవకాశం మెరుగవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు అందించి వివరాలను నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట సిద్దిపేట ఆర్డీవో సదానందం, ములుగు తహశీల్దార్ ప్రవీణ్, కొండపాక తహశీల్దార్ దిలీప్ కుమార్, గజ్వేల్ ఆర్డిఓ చంద్రకళ, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed