కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

by Shiva |   ( Updated:2023-03-22 12:41:26.0  )
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 30 వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా విద్యా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురి చేస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. అదేవిధంగా కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు 30 వరకు అమలులో ఉంటాయని ఆమె తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.

Next Story

Most Viewed