- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి :అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్
దిశ,పటాన్ చెరు : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా విలీనమైన గ్రామ పంచాయతీల పరిధిలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని కృష్ణా రెడ్డి పేట శ్రీకృష్ణ నగర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో రహదారులు, అంతర్గత మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ మంచినీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ సర్పంచ్ కృష్ణ, కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి,మాజీ ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.