సంగారెడ్డి జిల్లాలో కంపించిన భూమి

by samatah |   ( Updated:2022-12-06 07:24:43.0  )
సంగారెడ్డి జిల్లాలో కంపించిన భూమి
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్ పూర్, మనియార్ పల్లి రెండు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. ఈ విషయమై స్థానికులతో ప్రస్తావించగా రాత్రి మూడున్నర ప్రాంతంలో తెలిసి తెలియని విధంగా స్వల్పంగా భూమి కంపించిదని తెలిపారు. ఈ భూకంపం విషయం పొద్దున వరకు కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదు. పొద్దున హోటల్లో వద్ద చాయ్ తాగుతుండగా అక్కడి కి వచ్చిన సందర్భంలో కొందరు ఒకరికొకరు మాట్లాడుతూ జరిగిన విషయాన్ని పరస్పరం పంచుకున్నారు. దీంతో రాత్రి వచ్చిన కంపనలు భూకంపమేనని మాట్లాడుకోవడం కనిపించింది. రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు పేర్కొనగా మరికొందరికయితే ఈ విషయం గురించి అసలే తెలియదు. ఈ ప్రాంతంలో భూమి తరచు ఎందుకు కంపిస్తుందనేది , శాస్త్రవేత్తల పరిశోధనలలో మాత్రమే తేలనుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి : తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. తుఫాన్ హెచ్చరిక

Advertisement

Next Story

Most Viewed