- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే'
దిశ, దౌల్తాబాద్: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రతి కార్యకర్త కృషి అవసరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. దౌల్తాబాద్‌లో వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల, బూతు స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక కార్యకర్త కష్టపడాలన్నారు. 2023 లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది అని తెలిపారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడడంతో రాష్ట్రంలో దుబ్బాక గెలుపు సాధ్యమైందని, టీఆర్ఎస్‌లో వణుకు పుట్టిందని ఇదే ఊపులో రానున్న రోజుల్లో బూతు స్థాయిలో ఓటు బ్యాంకును బలోపేతం చేసి కార్యకర్తలు ముందుకు నడవాలని అన్నారు.
టీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల ముందు ఉండాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పి టీఆర్ఎస్ పతనానికి రూపకల్పన చేయాలని కార్యకర్తలను కోరారు. ఓటు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని ఓటును ప్రతీ ఒకరు వినియోగించుకోవాలని సూచించారు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.