యువత వాటికి బానిస కావద్దు.. డీఎస్పీ బాలాజీ

by Disha News Desk |
యువత వాటికి బానిస కావద్దు.. డీఎస్పీ బాలాజీ
X

దిశ, కంది: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గం వైపు పయనించాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలోని శాంతినగర్ రాయల్ జూనియర్ కళాశాలలో డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు, విద్యాబుద్దులు నేర్పే ఉపాధ్యాయులుపై కూడా ఉందని తెలిపారు. డ్రగ్స్, గంజాయ్‌కి అలవాటు పడితే యువత చెడిపోయే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరించారు. ఈ అలవాటు వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకుని మంచి దారిన ప్రయాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. డ్రగ్స్ తీసుకుని చాలా మంది యువత నేరాలకు పాల్పడి జైల్లో శిక్షలు అనుభవిస్తున్న సంఘటనలను విద్యార్థులకు వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ డ్రగ్స్, గంజాయినీ అరికట్టాలని సూచించారు. ఈ అవగాహన సమావేశంలో సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ కృపానిధి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


Advertisement

Next Story