- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెల్లో డ్రైనేజీ అస్తవ్యస్తం… ఎక్కడి చెత్త అక్కడే...
దిశ, కొండాపూర్: మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల గ్రామాల కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తిన జిల్లా స్థాయి అధికారులు సందర్శించిన స్థానికంగా ఉన్న అధికారుల నుంచి స్పందన కరువు అయ్యిందని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపిన గ్రామపంచాయతీ అధికారులతో పాటు మండల అధికారులు కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. మండల పరిధిలోని జిల్లాస్థాయి అధికారులు పర్యటించి సమస్యలు పరిష్కరించాలని చెప్పినా నిధులు లేవని గ్రామస్థాయి అధికారులు చేతులెత్తేస్తున్నారు. అలాగే మల్కాపూర్, మన్సాన్పల్లి, ముని దేవునిపల్లి, అనంతసాగర్, మారేపల్లి తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, మురికి కాలువలో చెత్త పేరుకుపోయి, రోడ్లపైకి మురికి నీరు రావడంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
మల్కాపూర్ గ్రామంలో ఇళ్ల మధ్యలో పెంట కుప్పలు ఉండడంతో గ్రామాల ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుంతపల్లి గ్రామంలో జిల్లా స్థాయి అధికారులు పర్యటించిన ఫలితం శూన్యం గా మారడం విచిత్రంగా కనిపిస్తుందని తెలిపారు. మారేపల్లి గ్రామంలో నీటి సమస్య ఉందని రెండు నెలల నుండి సంబంధిత అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఫోన్ చేస్తే కొందరు ఎత్తి మరికొందరు ఎత్తకుండా ఏదో ఒక సాకు చెప్పి పక్కకు తప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మండల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.