- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు ముంగిట్లోనే వడ్ల కొనుగోలు కేంద్రాలు: జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ
దిశ చిన్నకోడూర్: రైతు ముంగిట్లోనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దకోడూరులోని మెట్టుబండల వద్ద మైలారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు ముంగిట్లోనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు, పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
అదేవిధంగా అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ధాన్యం తడిసిందని అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరీ పాపయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత, సొసైటీ చైర్మన్లు సదానందం గౌడ్, కనకరాజు, సర్పంచ్ లు బట్టు లింగం, కాల్వ ఎల్లయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, వెలుగు ఏపీఎం మైపాల్, ఎంపీటీసీలు సాయన్న, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు