బ్యానర్ లో నా ఫోటో అక్కర్లేదా : సునీతా లక్ష్మారెడ్డి గరం.. గరం

by Shiva |
బ్యానర్ లో నా ఫోటో అక్కర్లేదా : సునీతా లక్ష్మారెడ్డి గరం.. గరం
X

దిశ, శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రైతు వేదిక ప్రారంభానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న బ్యానర్ లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఫోటో పెట్టకపోవడంతో ఆమె తహసీల్దార్ శ్రీనివాస్ చారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన సొంత గ్రామంలో కార్యక్రమానికి సమాచారం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తహసీల్దార్ పై గరం అయ్యారు.

Advertisement

Next Story