అంతా మా ఇష్టం.. అడిగేది ఎవరు..?

by Aamani |
అంతా మా ఇష్టం.. అడిగేది ఎవరు..?
X

దిశ,గంభీరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ యువత కోసం నూతనంగా ప్రవేశపెట్టిన రాజు యువ వికాస్ పథకం దరఖాస్తులకు నిరుద్యోగ ప్రజల నుంచి మీసేవ నిర్వాహకులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ కి ప్రభుత్వ రేటు 45 రూపాయలు కాగా, అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం మీసేవ వాళ్లు ఆన్లైన్ చేస్తే దాదాపు రూ.100 దాకా ప్రజల నుంచి తీసుకుంటున్నారు, ఇదేమిటి అని అడుగుతే నీ ఇష్టం ఉన్న దగ్గర చేయించుకో అని అంటున్నారు.

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలు దోపిడీకి నిలయాలుగా మారాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలన్నింటినీ మీ సేవలకు అప్పగించడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెల్లించాల్సిన రుసుము కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే మీ సేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు సేవలు చేయకుండా వారిని గంటలకు మీసేవ చుట్టూ తిప్పుకుంటూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇలా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో అడిగే వారు లేకపోవడంతో అంతా మా ఇష్టమైన విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ని మీసేవ సెంటర్లను నిర్వహకులు వ్యవహరిస్తున్నారు.

అధిక వసూళ్లకు పాల్పడుతూ..

ప్రభుత్వం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే సర్టిఫికెట్లను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటును ప్రభుత్వం నిర్ణయించింది.కానీ మీసేవ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. క్యాస్ట్ ,ఇన్ కామ్ , రెసిడెన్సి సర్టిఫికెట్ లకు 45 ధరను చెల్లించవలసి ఉంటుంది . కానీ ఒక్కొక్క సర్టిఫికెట్ కు అదనంగా 15 రూపాయలు కలిపి రూ.60 వసూలు చేస్తున్నారు . అలాగే సర్టిఫికెట్ ఫారాన్ని కూడా రెండు రూపాయల దానిని ఐదు రూపాయలకు వసూలు చేస్తున్నారు . అలాగే మిగతా సర్టిఫికెట్ కూడా చెల్లించవలసిన ధర కంటే 50 నుంచి 100 వరకు అధికంగా ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంటలకొద్ది మీసేవ వద్ద పడిగాపులు..

మీసేవ నిర్వాహకులు మీసేవ సర్వీస్ తో పాటు తో పాటు ఆన్లైన్ సర్వీసులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది . అయితే ఎమ్మార్వో ఆఫీస్ ఇతర శాఖల నుంచి వచ్చే ఆన్లైన్ దరఖాస్తు అవి ఎట్టి పరిస్థితుల మరొకరి దగ్గరికి వెళ్లిన చేసే పరిస్థితి లేదు. దానిని గుర్తించిన నిర్వాహకులు దరఖాస్తు తీసుకువచ్చిన వారి నుంచి వద్ద అప్లికేషన్ ఫామ్ తో పాటు ముందే ఫీజు తీసుకుని ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పనిచేయడం లేదని సర్వర్ బిజీ గా వస్తుందని సాకులు చెబుతున్నారు . మీసేవ వద్దకు వెళ్లిన దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను తీసుకొని వారికి ఆన్లైన్ పనిచేయగానే వెంటనే ఆన్లైన్ చేస్తామని చెబుతున్నారు. వారికి పనిలేని ఖాళీ సమయంలో వాటిని ఆన్లైన్ చేస్తున్నారు.

మీ సేవలో ఇతర ఆన్లైన్ సేవలు చేయడం వలనే ఇబ్బందులు..

మీ సేవ కేంద్రాలలో మీ సేవ నిర్వాహకుల తో పాటు జిరాక్స్ ఇతర ఆన్లైన్ సేవలను నిర్వహిస్తున్నారు . మీ సేవకు వచ్చే ప్రజల కంటే ఆన్లైన్ సేవలకు వచ్చే ప్రజలే అధికంగా ఉండటం జరుగుతుంది . అలాగే మీసేవ వారికే ఆధార్ సెంటర్లు ఇవ్వడం వలన అక్కడికి వెళ్లే వారు అధికంగా ఉండడంతో అక్కడ పనిచేసే వారు ఒక్కరే పని చేయడం వలన గంటల కొద్ది నిరిక్షంచవలసి వస్తుంది . సర్టిఫికెట్ల కోసం వివిధ గ్రామాల నుంచి మండలానికి వచ్చే వారు తమ కూలి పనులు వదులుకొని వస్తున్నారు . మీసేవ కేంద్రాల్లో వెంటనే ఆన్లైన్ చేయకపోవడం వలన ప్రజలు పనులు కొన్ని రోజుల కొద్దీ మీసేవ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీ సేవా కేంద్రాల్లో ఇతర ఆన్లైన్ సేవలు లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సేవలు చేసే మీ సేవలను రద్దు చేసి మరొకరికి ప్రజలు కోరుతున్నారు.

పటించుకొని అధికారులు..

మీ సేవా నిర్వహకులు ఇలా చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే మీ సేవ నిర్వాహకుల పై చర్యలు తీసుకుంటే.. ఇలా మీసేవ వారు అధిక వసుళ్లతో పాటు వచ్చిన వారికి వెంటనే సర్టిఫికెట్లకు ఆన్లైన్ చేసి ఇస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోరని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీసేవ సంబంధించిన అధికారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలుస్తుంది. ఎమ్మార్వో మారుతి రెడ్డి ని వివరణ కోరగా. రెండు మూడు రోజుల్లో మీసేవ యజమానులతో మీటింగ్ జరిపించి ప్రభుత్వం నుంచి వేచించిన రేటు మాత్రమే తీసుకోవాలని అధిక డబ్బులు వాసులు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Next Story

Most Viewed