- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి..

దిశ,నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ లోని (నల్లవాగు) సుల్తానాబాద్ గురుకుల పాఠశాలలో పెద్ద శంకరంపేట మండలం చిలపల్లి గ్రామానికి చెందిన దార నిఖిల్ కుమార్ 9 వ తరగతి చదువుతున్నారు. వారం రోజుల నుంచి జ్వరం రావడంతో ఎవరూ పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు గురుకుల పాఠశాల నుంచి నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి నుంచి హైదరాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు. దార నిఖిల్ కుమార్ (13) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆస్పత్రి నుంచి శనివారం తీసుకొని గురుకుల పాఠశాలకు తీసుకురాగా పోచ పూర్ సమీపంలో పోలీసులు శవాన్ని అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రిన్సిపాల్ తిరుపతయ్య ను పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మా కుమారుడు ఆరోగ్యంగానే ఉండేవాడని గురుకుల పాఠశాలలో వారం రోజులుగా మా కుమారునికి జ్వరం వచ్చిన మాకు సమాచారం ఇవ్వలేదు.. ఆసుపత్రికి తీసుకు పోలేదని, వారం రోజుల నుంచి అన్నం నీళ్లు తినకుండా పడుకొని ఉన్నాడని కనీసం స్కూల్ టీచర్, వార్డును, ప్రిన్సిపాల్ కన్నెత్తి చూడలేదన్నారు. విద్యార్థి పరిస్థితి విషమం ఉంచడంతో ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారన్నారు. మాకు చెప్పడంతో హడావుడి తీసుకెళ్ళాం, మా అబ్బాయికి ఏమైందని టీచర్ అలాగే ప్రిన్సిపాల్ లేడు ఉపాధ్యాయులకు అడుగుదామంటే మమ్మల్ని స్కూల్ నుంచి బయటకు గేంటేసినంత పని చేశారని విద్యార్థి తండ్రి దార సుధాకర్, తల్లి పూలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయి మరణానికి పూర్తి కారణం ప్రిన్సిపాల్ తిరుపతయ్య పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని, మా అబ్బాయికి వారం రోజుల నుంచి కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన హెల్త్ సూపర్వైజర్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉంటే మా కొడుకు బతికేవాడని అన్నారు.
గతంలో కూడా ప్రిన్సిపాల్ తిరుపతయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నిఖిల్ కుమార్ శవం వాహనం ముందు కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ధర్నా నిర్వహించారు. మాదిగ దండోరా డివిజన్ అధ్యక్షులు అలిగే జీవన్ ధర్నా నిర్వహించారు. కుటుంబానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆర్డిఓ అశోక చక్రవర్తి హామీ ఇచ్చారు.