దళారులను నమ్మి మోసపోవొద్దు: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Shiva |
దళారులను నమ్మి మోసపోవొద్దు: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, చిన్నశంకరంపేట: తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని, రైతులు ఎవరు నిరాశ చెందవద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ ఏకే.మంగాదేవి యాదవరావుతో ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను దళాలకు అమ్మి మోసపోవొద్దని ప్రభుత్వం మద్దతుకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. మద్దతు ధర ఏ-గ్రేడ్ రూ.2,060 బి-గ్రేడ్ రూ.2,040 పొందాలని రైతులకు సూచించారు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోగా ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు అధైర్య పడొద్దని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

అకాల వర్షంతో ధాన్యం రాసులు తడవడంతో ధాన్యాన్ని ఆరబెట్టి పిల్లలతో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏకే.మంగాదేవి యాదవరావు, జడ్పీటీసీ పట్లూరి మాధవి రాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సహకార సంఘం సొసైటీ చైర్మన్లు జంగరాయి శ్రీనివాస్ రెడ్డి, మడూర్ శ్రీనివాస్ రెడ్డి, చిన్న శంకరంపేట చైర్మన్ అంజిరెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బందెల ప్రభాకర్, మైపాల్ రెడ్డి, లింగారెడ్డి, కందుకూరి రవీందర్, మల్లేశం, దుర్గపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story