డోంట్ కేర్.. నిబంధనలు మాకు వర్తించవు..

by Anjali |
డోంట్ కేర్.. నిబంధనలు మాకు వర్తించవు..
X

దిశ గుమ్మడిదల: చేస్తుంది అక్రమ నిర్మాణం అయినా వణుకు, బేరుకులేదు. ఎవరొచ్చి అపుతారో ఆపండి అంటూ సవాళ్లు. అధికారులు ఆదేశాలు మాకు డోంట్ కేర్. నిబంధనలు మాకు వర్తించవు. నోటీసులిస్తే భయపడతామా..? నిర్మాణాన్ని ఆపే సమస్యే లేదు అంటూ గ్రానుల్స్ ఇండియా పరిశ్రమ బరి తెగిస్తుంది.

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణ పనులను చేపట్టింది. గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్యుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు తిలోధాకలిస్తూ బొంతపల్లి గ్రామ శివారు దాటి వీరన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 648, 649 లో ఎలాంటి అనుమతి లేకుండా పరిశ్రమ నిర్మాణం చేపట్టారు.. అయితే నిర్మాణ పనులు ఆపాలని పంచాయతీ కార్యదర్శి తూతూ మంత్రంగా రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులిస్తే మాకేంటి అన్న బరితెగింపుతో మరింత ముమ్మరంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పలు విమర్శలకు తావిస్తున్నది.


గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్యుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ పరిశ్రమ ప్రభుత్వం నుండి ఎటువంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండా పరిశ్రమని పొడిగిస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు తిలోధాకలిస్తూ బొంతపల్లి గ్రామ శివారు దాటి వీరన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 648, 649 లో ఎలాంటి అనుమతి లేకుండా పరిశ్రమ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ పనులు అపాలని పంచాయతీ కార్యదర్శి తూతూ మంత్రంగా రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులిస్తే మాకేంటి అన్న బరితెగింపుతో మరింత ముమ్మరంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.

అధికారుల అలసత్వం..

సామాన్యుడు చిన్న తప్పు చేస్తే క్షమించని అధికారులు పెద్దల విషయంలో మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిశ్రమ యాజమాన్యం పలుకుబడి కలిగిన వ్యక్తులది కావడంతో అధికారులు చర్యలు తీసుకోవాలంటే వెనుకంజ వేస్తున్నారు. తూతూ మంత్రంగా రెండు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రెండవ నోటీస్ ఇచ్చి నెల రోజులు పూర్తయిన ఆ అక్రమ నిర్మాణ విషయంలో మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అధికారులు మౌనముద్ర దాల్చడంతో తమ అక్రమ నిర్మాణ ఆపేదెవరన్న బరితెగింపుతో పరిశ్రమ యాజమాన్యం ఇష్టారీతిగా అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉంది. సామాన్యులకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం సరికాదని వెంటనే ఉన్నతాధికారులు కలగజేసుకొని సదరు పరిశ్రమ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story