ప్రియాంక మాటలు నమ్మి కర్ణాటక సమస్యలు కొనితెచ్చుకోవద్దు

by Naresh |
ప్రియాంక మాటలు నమ్మి కర్ణాటక సమస్యలు కొనితెచ్చుకోవద్దు
X

దిశ , జహీ‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ మాటలు నమ్మి కర్ణాటక సమస్యలు కొనితెచ్చుకోవద్దని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. కర్ణాటక సమస్యలు కావాలో లేక తెలంగాణ సంక్షేమం కావాలో ప్రజలు తేల్చుకొనే సమయం వచ్చేసిందన్నారు. 30వ తేదీన ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలీంగ్‌లో పాల్గొనాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా టీఎస్ఐడీసీ ఎండీ. తన్వీర్, డీసీఎంఎస్. చైర్మన్ శివకుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ మహంకాల్ శుభాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. గుండప్పలు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..పక్క రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలను కొనితెచ్చుకోవద్దన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కోసం అహర్నిశలు పనిచేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావును గెలిపించాలన్నారు. 2014 కంటే ముందు, తర్వాత ప్రభుత్వాలు, ఎమ్మెల్యేల పనితీరును మాణిక్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని పోల్చుకొని న్యాయంగా నిర్ణయం తీసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ఢిల్లీ దొరలు, గల్లీప్రజలకు జరుగుతున్న పోరాటంలో ప్రజలు గెలవాలని ఆకాంక్షించారు. ఎప్పుడు కూడా రాష్ట్రంపై ఢిల్లీ పాలకులు వివక్షను చూశారన్నారు. పార్టీ వరంగా, ప్రభుత్వ పరంగా చేపట్టిన అన్ని సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగాయన్నారు. గంటల పాటు వచ్చే కరెంటు కావాలా .. 24 గంటలు కరెంట్ కావాలా ప్రజల తెలుసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఎన్నికల తర్వాత ఒక్కసారైనా కర్ణాటక వెళ్లి పరిస్థితులను సమీక్షించారా అని ప్రశ్నించారు. మరొకసారి ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ నాయకులు బాల్ రాజు , బాబీ, ఓంకార్, విజయ్ ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story