- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనీస వేతనం రూ. 26 వేలకు తగ్గొద్దు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కనీస వేతనం రూ.26 వేలకు తగ్గకుండా నిర్ణయించాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం గురువారం సిద్దిపేటలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కార్మికుల వేతనాలు పెరిగిన ధరలకు ఆధారంగా పెంచలేదన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం శాస్త్రీయంగా కనీస వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి పేరిట యాజమానుల లాభాలు పెంచడం కోసం కార్మికులు వేతనాలు పెంచలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో వేతనాల సవరణ చేయకుండా కాలయాపన చేయడం కార్మికులు శ్రమ దోపిడీకి గురైయ్యారని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కార్మికుల వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించిందని మండిపడ్డారు. కార్మికుల కనీస వేతనాలు పెంచని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి, ఎం. పద్మ, జిల్లా కోశాధికారి భాస్కర్,నాయకులు రవికుమార్, చంద్రారెడ్డి, శోభ, రాళ్ళ బండి భాస్కర్, కనకయ్య, వెంకటయ్య, కుమార్, ఎల్లయ్య, వసంత, అంజయ్య, వెంకటాచారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.