ఈ నెల 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి సీఎం కప్

by Kalyani |
ఈ నెల 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి సీఎం కప్
X

దిశ, సంగారెడ్డి : ఈ నెల 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో పోటీల నిర్వహణకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నెల 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. జిల్లా నల మూలాల‌ నుండి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని క్రీడల అధికారులు కాసిం బేగ్, జావిద్ అలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాస్, పీడీలు, పీఈటీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed