- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంసీ ఎంసీ మీడియా సెంటర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ క్రాంతి
దిశ, సంగారెడ్డి : పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. మెదక్ , కామారెడ్డి జిల్లాల ఎంసీ ఎంసీ నోడల్ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీ ఎంసీ) ఏర్పాటు ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, పత్రికలో ప్రచురించిన రాజకీయ ప్రకటనలు అభ్యర్థి ఎన్నికల వ్యయంలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. శాటి లైట్ ఛానల్‌లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, ఈ పేపర్‌లో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్‌లు, ఇతర ఆడియో - వీడియో విజువల్ మీడియాలతో సహా రాజకీయ ప్రకటనలను ఎంసీ ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజారాణి, జిల్లా పౌర సంబంధాల అధికారి జి. ఏడుకొండలు, కలెక్టరేట్ ఓఓ పరమేష్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.