రేషన్ షాపులో నాసిరకం బియ్యం పంపిణీ: గ్రామస్థుల ఆందోళన

by Shiva |
రేషన్ షాపులో నాసిరకం బియ్యం పంపిణీ: గ్రామస్థుల ఆందోళన
X

దిశ, కొల్చారం: కొల్చారం మండలం చిన్నగన్నపూర్ పరిధిలోని రెండు రేషన్ షాపుల్లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గత మూడు రోజులుగా ఉండలు కట్టి, పూర్తిగా పురుగు పట్టిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు ఆ బియ్యం ఎలా తినాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపి నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపి నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story