- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ నెలలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పంపిణీ..
దిశ, దుబ్బాక : ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఈ ఋతుప్రేమ ద్వారా లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, డీపీఓ దేవకి ఆధ్వర్యంలో నిర్వహించిన రుతుప్రేమ అవగాహన సదస్సుకు మంత్రి హాజరై గ్రామ మహిళలకు రుతుప్రేమ కప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవ మనుగడకు మూల కారణం ఈ రుతుచక్రం, మానవ మనుగడను శాసించేది ఈ రుతుచక్రం అని, మీ నిశ్శబ్దం వీడాలని, మీరంతా రుతుప్రేమ ఆచరణలోకి తెస్తే మీ ఆరోగ్యం కాపాడుకున్న వారవుతారని వివరించారు.
పోతారం గ్రామ తరహాలోనే దుబ్బాక మండలంలోని గ్రామాల్లో రుతుప్రేమ కార్యక్రమం నిర్వహిద్దామని, మొక్కుబడిగా చేయొద్దని ఏ గ్రామం ముందుకొస్తే ఆ గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోతారం గ్రామం దుబ్బాక మండలానికే ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడే క్రమంలో శానిటరీ ప్యాడ్లు హానికరమైనవి భావించిన దరిమిలా ఈ ఋతుప్రేమ కార్యక్రమ ఆలోచన వచ్చి సిద్ధిపేట నియోజకవర్గంలో మొదలుపెట్టినట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రతీ మంగళవారం తిమ్మాపూర్ గ్రామ దవాఖానలో అన్నీ రకాల వైద్య పరీక్షలు జరిపి, ఆరోగ్య సంబంధిత సలహాలు, సూచనలు, మందులు అందిస్తామని, దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జూన్ నెలలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్..
రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు జూన్ నెలలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ అందజేయాలని నిర్ణయించినట్లు, గర్భిణీలకు 3వ నెల, 7వ నెలలో రెండుసార్లు ఈ కిట్లు ప్రభుత్వం అందజేస్తున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా 6.80 లక్షల మంది గర్భిణీలకు పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. అదే విధంగా గృహాలక్ష్మీ పథకం జూన్ నెలాఖరుకు ప్రారంభిస్తామని తెలిపారు. నిజమైన సంఘ సేవకురాలిగా సమాజ సేవ కై కృషి చేస్తున్న డాక్టర్ శాంతి సేవలను మంత్రి కొనియాడారు. రుతుప్రేమ కార్యక్రమం పై అందరికీ అవగాహన కలిగి ఉండి, పోతారం గ్రామ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని గ్రామ మహిళలను మంత్రి కోరారు.
మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు..
ప్రతీ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు జరపాలని, వ్యాధిగ్రస్తులు అందరికీ బీపీ, షుగరు సంబంధిత మందుల ఎన్సీడీ కిట్లు అందజేయాలని వైద్య వర్గాలు, ఆశాలకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రుతుప్రేమ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బీపీ, షుగరు వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారని వైద్య వర్గాలను ఆరా తీశారు. మొత్తం 450 మందికి పైగా బీపీ, షుగర్ వ్యాధి బారిన ఉన్నారని, వారిలో 154 బీపీ, 107 షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్లు అందించినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన వారందరికీ ఇవ్వకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేసి, 3 నెలలకు ఒక్కసారి వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఎన్సీడీ కిట్లు ప్రభుత్వం అందజేస్తున్నదని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే కంటి వెలుగు ద్వారా పోతారం గ్రామంలో 137 మంది దూరం చూపు, 119 మంది దగ్గరి చూపునకు కళ్ల అద్దాలు అందించినట్లు, మరో 46 మంది దూరం చూపు వారికి అద్దాలు త్వరలోనే అందించాలని వైద్య వర్గాలను మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి, మీనాక్షి, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, డీఎల్పీవో సెట్విన్ అమీనా, రుతు పేను ప్రత్యేకాధికారి మాధవి, ఎంపీపీ కొత్త పుష్పలత, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు . అనంతరం దుబ్బాక పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న సిద్దియోగ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు .