గురుకుల, కస్తూర్భా పాఠశాలలో డిజిటలైజేషన్‌ తరగతులు : మంత్రి దామోదర్‌

by Kalyani |
గురుకుల, కస్తూర్భా పాఠశాలలో డిజిటలైజేషన్‌ తరగతులు : మంత్రి దామోదర్‌
X

దిశ, అందోల్‌: అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ పరిశీలించారు. గురువారం అందోల్ వద్ద నర్సింగ్‌ కళాశాల కోసం సిద్దం చేస్తున్న భవనాన్ని, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గురుకుల, కస్తూర్భాగాంధీ పాఠశాలలో తరగతులను డిజిటలైజేషన్‌గా మార్చాలని, ఆర్‌వో ప్లాంట్‌లను ఏర్పాటు చేయించాలని, మైనర్‌ రిపేర్‌లను చేపట్టాలని తెలియజేయడంతో ఆయన వెంటనే వీటికి సంబంధించిన పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గురుకుల పాఠశాలలో ఈ నెల 11వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించే 10వ జోనల్‌ లేవల్‌ స్పోర్ట్స్‌ను సక్సెస్‌ చేయాలని ఆయన ఆకాక్షించారు. ఈ క్రీడల కోసం మైదానం చదును చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. జోగిపేట పట్టణంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న మైనార్టీ బాల, బాలికల రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రానున్న విద్యా సంవత్సరానికి మైనార్టీ బాలుర పాఠశాలను డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలోకి మార్చాలన్నారు. 1141 సర్వే నంబర్‌లో మైనార్టీ గురుకులానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో, అక్కడే మైనార్టీ గురుకులాలు ఉండేలా చూస్తామన్నారు. బాలికలకు సంబంధించిన విద్యాసంస్థలన్నీ ఒకే చోట ఉంటాయన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల ముందు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, ఈ విద్యాసంస్థల ముందు బస్‌షెల్టర్‌ను, వసతి గృహాల ముందు సెక్యూరిటీ గదులను ఏర్పాటు చేయిస్తామన్నారు.

గురుకుల పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూర్చునేందుకు షెడ్ నిర్మాణం, వాష్‌ రూమ్‌లను నిర్మించాలని మంత్రి తెలిపారు. 1141 సర్వే నంబర్‌లో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసి, పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను వేగవంతంగా నాణ్యతగా చేపట్టాలన్నారు. ఆయన వెంట ఆర్‌డీవో పాండు, డీఎస్‌పీ సత్తయ్య గౌడ్, రాష్ట్ర మార్క్‌ఫేడ్‌ డైరెక్టర్‌ ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ ఎం.జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ డెవిడ్, కౌన్సిలర్‌లు ఎస్‌.సురేందర్‌గౌడ్, ఆకుల చిట్టిబాబు, డి.శివశంకర్, మాజీ వైస్‌ చైర్మన్‌ రాములు, మాజీ వార్డు మెంబర్‌ పి.ప్రవీణ్‌కుమార్, నాయకులు డి.శేఖర్, రవి, రాములు, సందీప్‌గౌడ్, ధనుంజయ్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు .

వెజిటేబుల్‌ మార్కెట్‌కు ప్రతిపాదనలు...

మున్సిపాలిటీకి సంబంధించిన గాంధీ పార్కు స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ వెనుక భాగంలో వెజిటేబుల్‌ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. పట్టణంలో రోడ్లపై కూరగాయాల విక్రయాలు నిర్వహించడం వలన ట్రాఫీక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వారి కోసం ప్రత్యేకంగా అధునికరణ వెజిటేబుల్‌ మార్కెట్‌ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానన్నారు. పట్టణంలో ఎక్కడా కూడా కూరగాయాల క్రయవిక్రయాలు జరగకుండా కేవలం వెజిటేబుల్‌ మార్కెట్‌లోనే జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే చిరు వ్యాపారులు, షాపుల్లో అమ్మకాలు జరిపే వారితో చర్చలు జరిపి, అందరిని ఒకేచోటకు చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed