గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

by Aamani |   ( Updated:2023-10-05 11:07:48.0  )
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే
X

దిశ,చిన్నశంకరంపేట : చిన్న శంకరం పేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సుడిగాలి పర్యటించారు. మండలంలోని గవలపల్లి కొయ్య మర్రి తండా బీటీ రోడ్డు పనులకు, జంగారాయి తండా సీసీ. రోడ్డు పనులకు, చందాపూర్ గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి భవనం, సూరారం నుండి సూరారం తండా వరకు బీటీ రోడ్డు పనులను, గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు, యువకులకు స్పోర్ట్స్ కిడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి చెందుతే ప్రజలు బాగుంటారని, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం దేనిని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమైన అన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నీరు, 24 గంటలు పాటు కరెంటు, కళ్యాణ్ లక్ష్మి రైతు బీమా రైతు బంధు తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో అతుక పోయిందని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ప్రభుత్వాన్ని మరోసారి దీవించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లూరి రాజు, స్థానిక సర్పంచ్ పడల రమాదేవి, శ్రీనివాస్ పిఏసిఎస్ చేర్మేన్లు శ్రీనివాస్ రెడ్డి ,అంజిరెడ్డి, సర్పంచ్లు బందెల జ్యోతి ప్రభాకర్, మంచల లక్ష్మణ్, ఎంపిటిసి బషిపల్లీ యాదగిరి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి స్వామి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ గౌడ్, ఉపసర్పంచ్ లు నర్సింలు, రాంరెడ్డి, గ్రామ అధ్యక్షుడు పెంటయ్య, వార్డు సభ్యులు నాయకులు దుర్గ పతి, శ్రీనివాస్, నసింహరెడ్డి, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, నర్సింలు, శివరాములు, రాజారావు, సిద్ది రాములు, జగదీష్, శేకర్, లాలూ నాయక్ ,పోచయ్య, దుర్గ పతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed