- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామజిక సర్వేతో అట్టడుగు వర్గాల అభివృద్ధి.. మంత్రి దామోదర రాజనర్సింహ..
దిశ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీ, వార్డు నెం.32 లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేప్రక్రియలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్ నమోదు చేశారు. సర్వే ప్రక్రియలో విద్యానగర్ లో గల ఇంటి నుంచి మంత్రి స్వయంగా తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ సర్వేదేశంలోనే మొదటిసారిగా తెలంగాణలోనే జరుగుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇలా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సమీకరించడానికి మేలైన అవకాశం అని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వేప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను సక్రమంగా, సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి అసలు పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు.
సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం సులభం అవుతుందని అన్నారు. ఈ సర్వేలో ప్రజలందరూ పాల్గొని పూర్తిసమాచారం అందించాలని సూచించారు. సర్వే ద్వారా ప్రభుత్వం సమాజంలో వివిధ వర్గాల పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడమే కాకుండా వారికి సరైన మద్దతు, అవకాశాలు అందించడం సాధ్యమవుతుందన్నారు. సర్వే ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, ఇతర సామాజిక సమస్యలను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సర్వేలో వివిధ వర్గాలకు చెందిన కుటుంబాల నుంచి సేకరించిన సమాచారంతో ప్రభుత్వం అవసరాలకు తగిన విధంగా సహాయం చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల చురుకైన పాత్రతో, ప్రభుత్వం వారికి కావలసిన అవకాశాలను కల్పించగలగడం సాధ్యమవుతుందని, ప్రజల సహకారమే ప్రభుత్వానికి నిజమైన మార్గదర్శకం అని మంత్రి అన్నారు. సర్వే అధికారులను మంత్రి అభినందించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎన్యూమరేటర్, అధికారులు, తదితరులు సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు.