అప్పుల బాధలు తాళలేక యువకుడి ఆత్మహత్య

by Shiva |   ( Updated:2023-04-07 09:43:53.0  )
అప్పుల బాధలు తాళలేక యువకుడి ఆత్మహత్య
X

దిశ, మెదక్ ప్రతినిధి: అప్పుల బాధలు తాళలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం జక్కన్న పేటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగరాజు(33) ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలం నుంచి సతమతమవుతున్నాడు.

ఈ నెల5న ఉదయం పురుగుల మండు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజును మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యుల సూచన మేరకు అతడిని గాంధీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు హవేలీ ఘనపూర్ ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story