- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డీసీఎం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
by John Kora |

X
దిశ, కంది : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని అతి వేగంగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి పట్టణం శివారు పరిధిలోగల కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 55 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికుడైన డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో గాయాలకు గురైన గుర్తు తెలియని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే 9490617010 లేదా 08455-276333కు ద్వారా సమాచారం అందించాలని సీఐ రమేష్ సూచించారు.
Next Story