సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కి సహకారం : ఎమ్మెల్యే

by Kalyani |
సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కి సహకారం : ఎమ్మెల్యే
X

దిశ, సంగారెడ్డి: సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కావడానికి తన పూర్తి సహకారం ఉంటుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలు, పలు అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కావడానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా చేయడంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పట్టణం నీటి ముంపుకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

పాత మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ లు ఉండడంతో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సదాశివపేటలో డంపింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్ కు ఎమ్మెల్యే కోరారు. తారా డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, సితార థియేటర్ వద్ద శిధిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను తొలగించి నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, డీఈ ఇంతియాజ్ అహ్మద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed